అయితే సినిమాకు ముందు ఒక టీజర్‌ను రిలీజ్ చేశారు. అందులో గుడిలో, బడిలో పాటను రిలీజ్ చేశారు. ఇక అప్పటి నుంచి ప్రారంభమైంది గొడవ. బ్రాహ్మణుడిని కించపరిచే విధంగా ఉండటమే కాకుండా రౌద్రస్తోత్రం లోని నమకం, చమకం పదాలను శృంగార కీర్తనలుగా మార్చారంటూ ఆగ్రహంతో ఊగిపోయాయి బ్రాహ్మణ సంఘాలు.
అప్పుడెప్పుడో అదుర్స్, ఆ తరువాత దేనికైనా రెడీ, ఇప్పుడు దువ్వాడ జగన్నాథం. ఇలా బ్రాహ్మణుడిని కించపరుస్తూ తీసే చిత్రాలే ఎక్కువ. అదుర్స్, దేనికైనా రెడీ తరువాత బ్రాహ్మణులపై చిత్రాలు తీసినా కించపరిచే విధంగా ఉండదని భావించారు. కానీ దువ్వాడ జగన్నాథం సినిమా అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. అల్లుఅర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తుండగా అతను చేతిలో గరిట పెట్టుకుని.. వంట చేసే వాడిగా.. స్టైల్‌గా గరిట తిప్పుతూ కనిపిండచమే వివాదానికి తెరతీస్తోంది.
అంతేకాదు రౌద్ర స్తోత్రంలోని రెండు పదాలు ఎంతో శక్తివంతమైనవి. అదే నమక, చమకాలు. వాటిని హీరోహీరోయిన్లకు మధ్య జరిగే శృంగార కీర్తనల్లో కలపడంపై మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నాయి బ్రాహ్మణ సంఘాలు. అల్లు అర్జున్, హరీష్ శంకర్ ఇద్దరినీ బట్టలూడదీసి కొడతామని హెచ్చరిస్తున్నారు. వెంటనే ఆ రెండు పదాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.