గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన యువ హీరో నాగ శౌర్య

ఆదివారం, 9 ఆగస్టు 2020 (13:16 IST)
ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని యువ హీరో నాగశౌర్య తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతుంది.
 
ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ఫిల్మ్ నగర్ షేక్ పెట్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు.
 
అనంతరం మరో ముగ్గురు (ప్రముఖ నటుడు జగపతి బాబు, హీరో నారా రోహిత్, డైరెక్టర్ నందిని రెడ్డి) లు కూడా మూడు మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విసరాలని యువ హీరో నాగశౌర్య అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు