అలాంటి చంద్రబోస్‌కు కాలేజీలో రాసిన ఆయన మాటలు, పాటలకు స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో హైదరాబాద్ వచ్చారు. చాలారోజులు ఇందిరానగర్, జూబ్లీహిల్స్‌లో సినిమా ఆఫీసులకోసం తిరిగారు. తనను తాను పరిచయం చేసుకుని పాటు రాస్తాను అంటే.. ఓ చోట. ఇంతకుముందు ఎవరి దగ్గర చేశావ్` అనే ప్రశ్న తలెత్తేది. నేను ఎవరిదగ్గర పనిచేయలేదంటే. సరే చూద్దాంలే .అంటూ సమాధానం వచ్చేది. మరోచోట.. ఇంజనీరింగ్ చదివితే పాటలు ఎలా రాస్తావ్.. పొద్దున్నే వచ్చేస్తారు.. ఊరినుంచి అంటూ మరో చోట చీత్కారం. ఇంకో చోట అయితే, పాట ఇలాకాదమ్నా... నీ భాష ఏమిటో అర్థంకాదమ్నా.. సినిమా భాష వేరేమ్మా.. అంటూ సున్నితమైన వెటకారపు మాటలు స్వీకరించాల్సివచ్చేవి.. అలా ఛీత్కారాలతో ఇంటికి తిరిగివెళ్ళ లేక ఓ గదిలో నలుగురితో కలిసి రూమ్ పంచుకునేవాడు.
ఓ దశలో శ్రీకృష్ణుడు, శిశుపాలుడు కథ గుర్తుకువచ్చి, వంద ఛీత్కారాలను భరిద్దాం. ఆ తర్వాత కుదరకపోతే ఇంటికి వెళ్ళిపోదాం అని చంద్రబోస్ డిసైడ్ అయ్యాడట. అలా దాదాపు 21 చోట్ల ఛీత్కారాలు పొందాక ఓ స్నేహితుడు ద్వారా రామానాయుడుగారికి పరిచయం చేయడం, ఆయన తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ సినిమా హిట్ కావడంతో ఒక్కసారిగా తెలుగులో పట్టున్న రచయిత వచ్చాడంటూ సినిమారంగంలో ప్రచారం జరిగింది. అంతే ఇక అక్కడనుంచి వెనుతిరిగి చూసుకోలేదు చంద్రబోస్. ఇటీవలే తన ఛీత్కారాలకు గురించి వెల్లడించాడు చంద్రబోస్. ఇప్పటి యువతరం ఎవరైనా సరే అందరూ మంచి టాలెంట్ వున్నవారే ఈ రంగంలోకి వస్తున్నారు. కనుక ఇలాంటి అడ్డంకులు వుంటాయని ఆయన్ను నుంచి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.