జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై లవకుశ అనే పేరును కూడా ఖరారు చేశారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇందులో ఒక పాత్ర పేరు లవకుమార్, మరో పాత్ర పేరు జై అని తెలుస్తుండగా మూడో పాత్రకు సంబంధించి క్లారిటీ రావలసి ఉంది. ఆ మధ్య పోస్టర్‌తో మొదటి హీరోయిన్ రాఖి ఖన్నా అని ఖరారు చేసిన సినీ యూనిట్.. తాజాగా రెండో హీరోయిన్ నివేదా థామస్ అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ కన్ఫామ్ చేసింది.