జీవిత డిశ్చార్జ్, రాజశేఖర్ మాత్రం అక్కడే...

శనివారం, 24 అక్టోబరు 2020 (15:31 IST)
కోవిడ్ 19 సోకడంతో ఇటీవలే హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జీవితా రాజశేఖర్ దంపతులు చికిత్స కోసం చేరారు. కాగా ఈ ఉదయం జీవితకు కరోనా నెగటివ్ రావడంతో ఆమెను డిశ్చార్జ్ చేసారు.
 
మరోవైపు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా వున్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారనీ, పరిస్థితి మామూలుగానే వున్నట్లు పేర్కొన్నారు.

కాగా తన తండ్రి ఆరోగ్యంపై శివాత్మిక ట్విట్టర్లో పోస్ట్ చేయగానే, దానికి పలువురు స్పందించారు. రాజశేఖర్ త్వరగా కోలుకుని షూటింగులో పాల్గొంటారని మోహన్ బాబు ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు