''కాంచన'' లారెన్స్ తమ్ముడితో సినిమా: నో చెప్పిన కాజల్ అగర్వాల్

ఆదివారం, 5 జులై 2015 (16:22 IST)
''కాంచన'' సీక్వెల్‌తో మంచి హిట్ కొట్టిన లారెన్స్.. త్వరలో తన తమ్ముడు ఎల్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. ఇందులో నెంబర్ వన్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించాడట. అంతేగాకుండా రూ.2కోట్లు ఇస్తానని కూడా చెప్పాడట. కానీ ఇందుకు కాజల్ నో చెప్పేసింది. 
 
ఓ వైపు పెద్ద హీరోలతో చేస్తూ మరోవైపు కొత్త వాళ్లతో చేస్తే ఉన్న అవకాశాలు కూడా పోతాయని భావించిన కాజల్.. ఈ ఆఫర్‌ను తిరస్కరించిందని కోలీవుడ్ వర్గాల్లో టాక్. ఇకపోతే.. ప్రస్తుతం ధనుష్‌తో 'మారి', విశాల్‍తో 'పాయం పులి' సినిమాలలో కాజస్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలుగులో మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని కూడా కైవసం చేసుకున్న సంగతి విదితమే. 

వెబ్దునియా పై చదవండి