క‌మ‌ల్ హాస‌న్ ఖ‌రీదైన బ‌హుమ‌తి ఇచ్చాడు

మంగళవారం, 7 జూన్ 2022 (20:07 IST)
Kamal Haasan, Lokesh Kangaraj
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ చాలా కాలం త‌ర్వాత హిట్ కొట్టాడు. విక్ర‌మ్ సినిమాతో అటు యూత్‌ను ఇటు పెద్ద‌ల‌ను ఆక‌ట్టుకున్న ఈ సినిమాలో ఆయ‌న ఎంత మేర‌కు వున్నాడ‌నేదానికంటే ఈ సినిమాను అన్నిచోట్ల ఆద‌రిస్తున్నారు. దాంతో ఊహించ‌ని క‌లెక్ష‌న్లు రావ‌డంతో క‌మ‌ల్ హాస‌న్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నాడు. త‌న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజుకు ఖ‌రీదైన గిఫ్ట్‌ను క‌మ‌ల్ అంద‌జేశారు. 
 
ఈ చిత్రం స‌క్సెస్ ఆనందంలో వున్న‌ హీరో కమల్ హాసన్, లోకేష్‌కి కోటి రూపాయలకు పైగా ఖరీదు చేసే లెక్సస్ సెడాన్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమా విడుద‌ల‌కుముందు హైద‌రాబాద్ వ‌చ్చిన క‌మ‌ల్‌.. తెలుగు సినిమాలో ఎప్పుడు న‌టిస్తారంటే.. విక్ర‌మ్ సినిమాను విజ‌య‌వంతం చేయండి. అప్పుడు వ‌చ్చి చెబుతానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సో. కొద్దిరోజుల్లో రానున్న క‌మ‌ల్ ఏ నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తారో చూడాలి. విక్ర‌మ్ సినిమాను ఆర్ మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్  నిర్మించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు