'ఒరు ఆడార్ లవ్' సినిమా పాటకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అండగా నిలిచారు. మపిల్ల పట్టు అనే ముస్లిం సంప్రదాయ పాటను మళయాళంలో 'ఒరు ఆదార్ లవ్' అనే సినిమాలో ఉపయోగించారు. ఆ పాటలో ప్రియా ప్రకాశ్ వారియర్ కనుసైగలతో ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆమె అలా కనుసైగలు చేయడం ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నాయని, తక్షణమే ఆ వీడియోల్ని డిలీట్ చేయాలనే డిమాండ్లు వినిపించాయి.
ఈ వివాదంపై కేరళ సీఎం పినరాయి విజయన్ స్పందించారు. కేరళలో భావన ప్రకటన స్వేచ్ఛపై అసహనాన్ని ఆమోదించబోమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారియర్ యాక్ట్ చేసిన పాటను 1978లో ఆకాశ వాణిలో ప్రసారం చేసారని గుర్తు చేశారు. మపిల్ల పట్టు అనే ముస్లిం సంప్రదాయ పాట ఆధారంగా పీఎంఏ జబ్బార్ రాసిన గేయాన్ని రఫీఖ్ పాడారని తెలిపారు. ముస్లింల వివాహాల్లో ఈ పాటను దశాబ్దాలుగా పాడుతూనే ఉన్నారని విజయన్ వెల్లడించారు.