బాలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అమితాబ్ నటించేందుకు అంగీకరించక పోతే ఆ సినిమా తీయడాన్ని ఆపివేయాలా అంటూ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వందో చిత్రం రేసులో కృష్ణవంశీ పేరు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. 'రైతు' కథతో ఓ స్క్రిప్టు తయారు చేసి బాలకృష్ణకు కృష్ణవంశీ వినిపించగా, అది ఇద్దరికీ నచ్చింది. అయితే ఈలోగా క్రిష్ మళ్లీ రేసులోకి వచ్చాడు. బాలయ్యకు ఓ కథ వినిపించాడు. దీంతో కృష్ణవంశీ చిత్రం వెనక్కి వెళ్లిపోయింది.