లేడీస్ సూపర్ స్టార్ నయనతార కొత్త గెటప్‌లో అదరగొట్టేస్తోంది. హీరోయిన్‌గానూ, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అదరగొట్టేస్తున్న నయనతార త్వరలో అమ్మవారి పాత్రలో కనిపించనుంది. శ్రీరామరాజ్యం సినిమాలో సీతమ్మ పాత్రలో నటించి మెప్పించిన నయనతార త్వరలో అమ్మవారి పాత్రలో కనిపించనుంది. తమిళ సినిమా ''మూకుత్తి అమ్మన్''లో నయన్ అమ్మవారి గెటప్‌లో దర్శనమివ్వబోతోంది.