ఎలిజిబుల్ బ్యాచ్‌లర్- ప్రీ రిలీజ్ వేడుక‌కు నాగ చైతన్య

బుధవారం, 6 అక్టోబరు 2021 (11:37 IST)
Eligible Bachelor. poster
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. బన్నీ వాసు, ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి అక్కడ్నుంచి ప్రశంసలు దక్కించుకుంది. 
 
ఈ మధ్యే జరిగిన వ్రాప్ అప్ పార్టీలోనూ జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను చాలా బాగా నవ్వించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ వచ్చింది. 
 
ఇదిలా వుండ‌గా, అక్టోబర్ 8న జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సి. కన్వెన్షన్ హాల్‌లో ఈ వేడుక జరగబోతుంది. దీనికి నాగ చైతన్య ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వస్తుంది. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా ఉండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. యూ ట్యూబ్‌లో ఇప్పటికే 7.8 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది ఈ చిత్ర ట్రైలర్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు