ఇలాంటి కథ ఇప్పటికీ తగినదేనని ఎ. కోదండరామిరెడ్డి తెలియజేస్తున్నాడు. అప్పట్లో విజయవాడ థియేటర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల మధ్య చూశాను. ఇదేదో కొత్తగా వుందని ప్రేక్షకులు అనుకోవడంతో సక్సెస్ సాధించానని ఆనంద పడ్డాను. అలా వేసిన అడుగు 23 సినిమా వరకు చిరంజీవితో ప్రయాణం సాగింది. కోదండరామిరెడ్డి, చిరు కాంబినేషన్ అంటే పెద్ద హిట్ అనే టాక్ వుండేదని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో శతదినోత్సవ వేడుకలో దాసరి మాట్లాడుతూ, కొత్త కోణంలో సినిమాను తీశారని దర్శకుడిని అభినందించారు. ఈ సినిమాను తమిళ, కన్నడలోనూ రీమేక్ చేశారు. అక్కడా విజయం సాధించింది.