బాలీవుడ్ నటుడు ఓం పూరి సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. యూరీ, బారాముల్లా ఆర్మీ స్థావరాల్లో భారత జవాన్లు చనిపోవడంపై ఓ టీవీ ఛానెల్ చర్చలో ప్రశ్నించగా ఓం పూరి స్పందించారు. వారిని ఆర్మీలో చేరమని ఎవరన్నారు? ఎవరు ఆయుధాలు పట్టుకోమన్నారు? వారినేమైనా బలవంతం చేశామా అని ఓం పూరి సమాధానమిచ్చారు. దీనిపై కలకలం రేగింది. భారత్‌కు పాకిస్థాన్‌కు మధ్య ఉన్న తేడా ఏంటనే ప్రశ్నకు తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలే నిదర్శనమని తెలిపారు.