ఇంతకీ అసలు విషయం ఏమిటంటే? బాలాకోట్ దాడులపై గతంలో భారత ప్రధాని మోదీ వ్యాఖ్యలను వీణా మాలిక్ ప్రస్తావిస్తూ.. ఆ దాడుల సమయంలో వాతావరణం సరిగ్గా లేకపోవడం చేత సరిహద్దులు దాటడానికి అధికారులు భయపడుతుంటే తాను భరోసా ఇచ్చానని మోదీ చెప్పారు. మేఘాలు దట్టంగా ఉంటే మనకే మంచిదని, రాడార్లకు మన విమానాలు కనిపించవని గుర్తు చేశానని మోదీ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై వీణామాలిక్ స్పందిస్తూ.. ఏఎన్-32ను రాడార్లు కనుక్కోవడం లేదని, మేఘాలు దట్టంగా ఉండటమే కారణమని ఓ స్మైలీ ఇమేజ్‌ని జత చేసి ట్వీట్ చేసింది. అయితే వీణామాలిక్ కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విమానాన్ని కనుగొనేందుకు ఇప్పటికే ఇస్రో శాటిలైట్లు, రాడార్లు రంగంలోకి దిగాయని గుర్తుచేశారు.