పూర్తి యాక్షన్ సినిమా గా వైలెన్స్ ఉండటంతో ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సెన్సార్ సభ్యులు తెలిపారు. ఐదు భాషల్లో తమ పాత్రలకు ప్రభాస్, పృథ్వీరాజ్ డబ్బింగ్ పూర్తి చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రమిది. శృతిహాసన్, జగపతి బాబు, శ్రీయారెడ్డి తదిరులు నటించారు. భారీ తారాగణం నటించిన ఈ సినిమా విడుదలకు బాలీవుడ్ సినిమా దంకీ కూడా విడుదలకాకుండా చేశారని తెలుస్తోంది.