ఈ నేపథ్యంలో రాహులే బిగ్ బాస్ మూడో సీజన్ టైటిల్ విన్నర్ అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ షో ముగిసేందుకు ఇంకా రెండు వారాలే మిగిలి వున్న తరుణంలో ఈ వారం వితికా షేరు, శివజ్యోతి లేదా బాబా భాస్కర్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురిలో ఎలిమినేట్ అయ్యేది మాత్రం వితికా షేరే అంటున్నారు నెటిజన్స్.
ఇక టైటిల్ ఫేవరేట్‌గా ముందు వరుసలో రాహుల్, అలీ రెజా, బాబా బాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్‌లు ఉన్నారు. కాగా మొదటి నుంచి శ్రీముఖి రాహుల్‌ను టార్గెట్ చేస్తూ.. కావాలని రాహుల్‌ను రెచ్చగొడుతోంది. దాంతో శ్రీముఖిపై ఆడియన్స్‌లో నెగిటివ్ ఇంపాక్ట్ మొదలైంది.