టాలీవుడ్ హీరో గోపీచంద్ నటిస్తున్న చిత్రం సీటీమార్. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుకుంటూ వస్తోంది. ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమాను దర్శక నిర్మాతలు సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.