పల్లెలోని సఖ్యతకీ.. సంతోషానికి.. సంబరానికి ఈ పాట అద్దం పడుతోంది. సంగీతం.. సాహిత్యం.. నృత్యం సమపాళ్లలో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. దేవీశ్రీ స్వరపరిచిన ఈ బాణీ.. ఆయనకి మరిన్ని మార్కులు తెచ్చిపెట్టడం ఖాయమని చెప్పొచ్చు. ఈ సాంగ్ ప్రోమో చూసిన తర్వాత, ఈ సినిమా హిట్‌పై అభిమానుల నమ్మకం మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.