మహిళల పట్ల దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలను బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన షారూఖ్ ఖాన్ సహించుకోలేకపోతున్నాడు. మహిళలు, వృద్ధ మహిళలు, అమ్మాయిలు, బాలికల పట్ల జరుగుతున్న అరాచకాలపై షారూఖ్ ఖాన్ స్పందించాడు. అమ్మాయిల పట్ల అమర్యాదగా మెలిగితే ఏమాత్రం సహించబోనని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని తాను ఇంటి నుంచే పాటిస్తున్నానని వెల్లడించాడు.
ఇటీవల బెంగళూరులో యువతులపై జరిపిన దాడులమీద ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన షారుక్ ఖాన్ పిల్లల్ని తల్లిదండ్రులు హద్దుల్లో ఉంచి పెంచాలని సూచించాడు. ఇందులో భాగంగా మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని తన కుమారులు ఆర్యన్, అబ్‌రామ్‌లకు పదేపదే చెబుతానన్నారు. స్త్రీలను గౌరవించాలని.. ఆడవారితో మాట్లాడేటప్పుడు వారిని నువ్వు, గివ్వు అని అనకూడదని తమ పిల్లలకు నేర్పుతున్నట్టు షారూఖ్ తెలిపాడు. అంతేకాదు, ఈ విషయంలో ఒకవేళ తమ కుమారులు తప్పు చేస్తే వారి తలలు తీసేస్తానని షారూఖ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.