పెరుగన్నంలో ఉల్లిపాయలను కలుపుకుని తింటే.. ఇన్ఫెక్షన్లు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఉల్లిలో వుండే పోటాషియం, విటమిన్ సి, విటిమిన్ బి శరీరంలో వున్న కొవ్వును తగ్గించడంలో సహయపడతాయి. ఇంకా నిద్రలేమి, నిద్ర రుగ్మత సమస్యలు దరిచేరవని.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను అదుపులో వుంచడమే కాకుండా చక్కెర స్థాయిలను అదుపులో వుంచుతుంది. మగతనాన్ని తగ్గించదు. గుండె వ్యాధులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను తీసివేస్తుంది. అందుకే చికెన్ బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలని తింటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఉల్లిపాయను ఉపయోగించటం వలన మంచి జ్ఞాపకశక్తి మరియు ఒక బలమైన నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఉల్లిపాయ రసాన్ని తల మీద చర్మం మీద రాస్తే చుండ్రు, జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.