టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆగస్ట్, సెప్టెంబర్ నెలలలో యునైటెడ్ స్టేట్స్ లో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డి.సి., చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్, డల్లాస్ లో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా యూఎస్‌లో 'అలా అమెరికాపురములో' పేరుతో హంసిని ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేసిన అతి పెద్ద మ్యూజికల్ కార్నివాల్ లో పాల్గొననున్నారు. తమన్ బృందంలో శివమణి, నవీన్, ఆండ్రియా జెరెమియా, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, హరిక నారాయణ్, శ్రుతి రంజని, మనీషా, రోషిని, శాండిల్య, జోబిన్ డేవిడ్, సుభాశ్రీ, రాకేశ్ చారి, ఓషో వెంకట్, సిద్ధాంత్, షదాబ్ రాయిన్ వంటి ప్రతిభావంతులైన ప్రదర్శనకారులు ఉన్నారు.