ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫిన్లాండ్లో ప్రస్తుతం మంచు కాలం. అక్కడ పూర్తిగా మంచుతో కప్పబడిన రోడ్లు, చెట్లు కనిపిస్తున్నాయి. ఆ ఫొటో పోస్ట్ చేస్తూ, ఇది పని నుండి విరామం తీసుకొని కుటుంబంతో విహారయాత్రకు వెళ్లడానికి సమయం ఆసన్నమైంది, సెలవుల కోసం రొమాంటిక్ టూర్ ఫిన్లాండ్కు వెళ్ళామని పేర్కొంది. త్వరలో ఆ ఇద్దరు ముగ్గురు అయితే అటు కుటుంబంలోనూ ఇటు అభిమానుల్లోనూ సంతోషం వెల్లివిరిస్తుంది.