నడి సముద్రంలో పడవ - ఏకాంతంగా గడిపిన వైష్ణవ్ - కృతిశెట్టి! (ఇదిగో వీడియో)

శుక్రవారం, 19 మార్చి 2021 (11:58 IST)
మెగా ఫ్యామిలీకి చెందిన హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెన. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది. ముఖ్యంగా, ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 
 
శ్రీ‌మ‌ణి రాసిన ఈ సినిమా పాట‌లు కొన్ని నెల‌లుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ఈ సినిమాలో సముద్రం అందాల న‌డుమ ప‌డ‌వ‌లో హీరో, హీరోయిన్లు పాడుకునే పాట‌ ‘జలజల జలపాతం నువ్వు’ పూర్తి స్థాయి వీడియోను ఈ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.  
 
ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి సముద్రం అందాల న‌డుమ‌ ప‌డ‌వ‌లో ఏకాంతంగా గ‌డిపిన సంద‌ర్భంగా ఈ చిత్రంలో ఈ పాట ఉంటుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ పాట‌ను శ్రేయా ఘోషల్‌, జస్‌ప్రీత్ జాజ్ పాడారు. ఈ సినిమా మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమైంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు