ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్‌రాజా కాంబినేషన్‌లో వస్తోన్న10వ చిత్రం కావడం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న తెలుగు,తమిళ,మళయాల, కన్నడ భాషల్లో విడుదలచేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా యాక్షన్ హీరో విశాల్ మాట్లాడుతూ - ``ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ `చక్ర` చిత్రాన్ని ఫిబ్రవరి 19న నాలుగు సౌత్ఇండియన్ లాంగ్వేజెస్‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. ఇంకా ఈ సినిమాలో మనోబాలా, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి.బాలసుబ్రమనియం, సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాత: విశాల్,రచన- దర్శకత్వం: ఎం.ఎస్ ఆనందన్.