advisesh,vijay, kavya and ohters
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు 2 సినిమా మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. విజయ్ ఆంటోనీకి జోడిగా ఈ సినిమాలో కావ్యా థాపర్ నటించారు. తెలుగులో ఈ సినిమాను ఉషా పిక్చర్స్ బ్యానర్ మీద విజయ్ కుమార్, వీరనాయుడు సంయుక్తంగా మే 19న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అడివి శేష్, ఆకాష్ పూరిలు ముఖ్య అతిథులుగా వచ్చారు.