అందాల తారలు సదా, స్నేహా ఉల్లాల్, రియాసేన్, దేశ్‌ముఖ్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఓ తమిళ చిత్రం 'ఆ రోజు' పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. 'ఏం జరిగింది?' అనే ఉప శీర్షిక. గ్లామర్ ఓరియంటెడ్ హార్రర్ చిత్రమిది. ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు మరియు దర్శకుడు సంతోష్ శివన్ సోదరుడు సంగీత్ శివన్ ఈ చిత్రానికి దర్శకుడు మరియు ఛాయాగ్రాహకుడు కావడం విశేషం.
నివేద స్టూడియో ఫిలిం కంపెనీ సమర్పణలో ప్రముఖ నిర్మాత అడ్డాల వెంకట్రావు-ఎ.సెల్వం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ మరియు రికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు అడ్డాల వెంకట్రావు-ఎ.సెల్వం మాట్లాడుతూ.. 'ఓ వినూత్నమైన కథాశంతో రూపొందిన చిత్రమిది. తమిళ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న ఈ గ్లామర్ ఓరియంటెడ్ హారర్ చిత్రం మన తెలుగు ప్రేక్షకుల్ని కూడా విశేషంగా అలరిస్తుందనే నమ్మకం మాకుంది.
సదా, స్నేహా ఉల్లాల్, రియాసేన్‌ల గ్లామర్, కథాంశంలోని నవ్యత, ముఖ్యంగా హార్రర్, సంగీత్ శివన్ ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ప్రస్తుతం డబ్బింగ్ మరియు రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ కాపీ సిద్ధమవుతుంది' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: శర్మ, పాటలు: పొందూరి, యం.రామారావు, మాటలు: అడ్డాల వెంకట్రావు, ఎడిటింగ్: ఎల్.రామారావు, కో-ప్రొడ్యూసర్: అరుణ్, నిర్మాతలు: అడ్డాల వెంకట్రావు-ఎ.సెల్వం, ఛాయాగ్రహణం-చిత్రానువాదం-దర్శకత్వం: సంగీత్ శివన్!!