అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఈ చిత్రాన్ని రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి నిర్మించారు. లాక్డౌన్ సెకండ్‌వేవ్ వల్ల థియేటర్లో విడుదలకు నోచుకోకపోవడంతో దర్శక నిర్మాతలు ఆహా ఓటీటీలో మే 7న విడుదల చేస్తున్నారు.
`థాంక్యూ బ్రదర్` చిత్ర ట్రైలర్‌ను స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచే కాదు.. రెబల్‌స్టార్ ప్రభాస్, సూపర్‌స్టార్ మహేశ్, వెర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి సహా నెటిజన్స్ నుంచి చాలా మంచి రస్పాన్స్ వచ్చింది. ఆసక్తి కరంగా ఉండే డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎగ్జయిటింగ్ క్లైమాక్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సరైన పాళ్లలో చిత్రం రూపొందింది.
నటీనటులు: అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, అర్చనా అనంత్, అనీష్ కురువిల్లా, ఆదర్శ్ బాలకృష్ణ, మోనికా రెడ్డి, హర్ష చెముడు తదితరులు.