అలాగే, రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు 72 గంటల ముందు కోవిడ్ నెగెటివ్ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దేశీయ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త మార్గదర్శకాలు అమలులోకి తీసుకువచ్చినట్లు ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా వెల్లడించింది..