వంట గదిలో స్టోర్ రూమ్ ఎక్కడ ఉండొచ్చు?

File
FILE
చాలా మంది మంచి ఇంటిని నిర్మించుకుంటారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక వారికి లేనిపోని సందేహాలు వస్తుంటాయి. ఇలాంటి వాటిలో వంట గదిలో స్టోర్ ఉండొచ్చా.. ఉంటే.. ఏ వైపు ఉండాలన్న ధర్మ సందేహం వారిని వెంటాడుతుంది.

ఇదే అంశంపై వాస్తు నిపుణుల దృష్టికి తీసుకెళితే.. కిచెన్ ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకున్న తర్వాత కిచెన్ గది వైశాల్యాన్ని స్టోర్‌ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే పెంచుకోవచ్చని చెపుతున్నారు. స్టోర్ రూమ్‌ను కిచెన్‌కు నైరుతి భాగంలో పెట్టడం శ్రేయస్కరమంటున్నారు. లేదా కిచెన్ దక్షిణ భాగం మొత్తం స్టోర్‌ని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.

అయితే, కిచెన్‌కు ఆగ్నేయంలో యుటిలిటి వచ్చినప్పుడు అందులోకి ద్వారాన్ని పెట్టుకోవాల్సి ఉంటుందని చెపుతున్నారు. అప్పుడు మూడు అడుగులు వదిలి మిగతా దక్షిణ నైరుతి భాగాన్ని స్టోర్‌గా మార్చుకోవచ్చంటున్నారు.

అలాగే, పడమర భాగంలో ఉత్తర, దక్షిణాలుగా కిచెన్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని, కిచెన్‌లోకి పడమర వైపు నుంచే ద్వారం పెట్టుకోవాల్సి వస్తే పడమర, వాయువ్యంలో ద్వారం ఏర్పాటు చేసుకొని మిగతా పడమర నైరుతిలో స్టోర్ కట్టుకోవాలని వారు సలహా ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి