ఆంధ్ర అనే అబ్బాయితో తెలంగాణా అనే అమ్మాయి కలిసుండలేదు

తెలంగాణా సాధనే ధ్యేయంగా ఆ ప్రాంతాల్లో పలు రకాలైన విధానాలను అవలంభిస్తున్నారు. తెలంగాణాను కాంక్షించే ఉద్యమకారులు కొందరు "ఆంధ్ర అనే అబ్బాయితో అమాయక తెలంగాణా అనే అమ్మాయి కలిసి కాపురం చేయలేదనే టైటిల్‌తో పుస్తకాలను ముద్రించి ప్రజలకు పంచుతున్నారు.

ఈ పుస్తకాల్లో తెలంగాణా వెనకబాటుతనాన్ని సవివరంగా వివరించారు. అంతేకాదు ఆంధ్రవాసులు తెలంగాణాపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ వ్యాసాలు సైతం ముద్రించారు. ఆంధ్రవాసులు ఎలా పెత్తనం చేస్తున్నారనే అంశాలను సైతం జోడించారు.

అయితే ఆంధ్రలో తెలుగువాళ్లందరూ ఒకటేననీ, ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయించడం లేదని ఎదురు ప్రశ్నలు వేస్తున్నవారికి మాత్రం తమ వాణిని బలంగా వినిపిస్తూ, తమ వాదనలోని నిజాన్ని గ్రహించమంటున్నారు.

మరి వీరి తెలంగాణా పుస్తకంలోని ఉద్యమ వచనాల ఫలితంగా "ఆంధ్ర" అనే అబ్బాయి "తెలంగాణా" అనే అమ్మాయికి విడాకులు ఇస్తాడో లేదో చూడాలి మరి.

వెబ్దునియా పై చదవండి