చేపల కూర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది. చేపల్లోని పోషక విలువలు, చేపల పులుసులో వుపయోగించే సుగంధ ద్రవ్యాల కారణంగా చేపల కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
చేపలులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
చేపల కూర విటమిన్ డి, ఇనుము, అయోడిన్ వంటి విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం.
చేపలకూరల్లో ఉపయోగించే పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
చేపలలో లభించే విటమిన్ ఎ, కంటి ఆరోగ్యం మరియు దృష్టికి ముఖ్యమైనది.
చేపలు బలమైన ఎముకలకు అవసరమైన కాల్షియం, భాస్వరాన్ని అందిస్తాయి.