కోర్టు కేసులు, ఇతరత్రా అభ్యంతరాల్లేని నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు జిల్లా), ఆకివీడు (పశ్చిమ గోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), గురజాల, దాచేపల్లి (గుంటూరు), దర్శి (ప్రకాశం), కుప్పం (చిత్తూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (కడప), పెనుకొండ (అనంతపురం) పురపాలక సంఘాల్లో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించింది.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అదే విధంగా మరో 20 పుర, నగరపాలక సంస్థల్లోనూ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానాలకూ ఎన్నికలు నిర్వహించే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది.