బార్లీ నీరు. బార్లీని నీటిలో ఉడికించి, మిశ్రమాన్ని వడకట్టడం ద్వారా బార్లీ నీటిని తయారు చేయవచ్చు. రుచి కోసం నిమ్మరసం తేనె జోడించవచ్చు. అయితే, బార్లీ నీరు మూత్రవిసర్జన అవుతుంది కనుక మోతాదుకి మించి తాగకూడదు. బార్లీ వాటర్ ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇంకా ఈ బార్లీ నీటితో కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపుమంటను బార్లీ వాటర్ తగ్గిస్తుంది.
బార్లీ యాంటీ-ఇన్ప్లమేటరీ లక్షణం కలిగి ఉంది కనుక కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
మూత్రపిండాలలో ఉన్న రాళ్లను బయటకు పంపించటంలో ఈ బార్లీ నీళ్లు ఎంతగానో సహాయపడతాయి.
అధికబరువును తగ్గించుకోవటంలో కూడా ఈ బార్లీ ఎంతగానో సహాయపడుతుంది.