రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్ 23.03.2020 నుండి 22.05.2020 వరకు మొత్తం 74,565 వాహనలను సీజ్ చేయడం జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ స్వాధీనం చేసుకున్న వాహనాలను గత నాలుగు రోజులుగా సంబంధిత వాహన యజమానులు సరైన ధ్రువపత్రాలను అధికారులకు అందించి తమ వాహనాలను తీసుకు వెళ్లడం జరుగుతుంది.
వాహనదారులు తిరిగి రోడ్లపైకి వచ్చే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నియమ, నిబంధనలు, సూచనల మేరకు కోవిడ్ రక్షణ చర్యలను పాటించవలసిదిగా వాహన యజమానులకు సూచించడం జరుగుతుంది.
మొత్తం : 74,565 వాహనాలను స్వాధీనం చేసుకోగా 23.05.2020 వ రోజు నుండి ఈ రోజు 26.05.2020 వరకు 52,628 వాహనాలను తిరిగి ఇవ్యడం జరిగింది. ఇంకా 21,937 వాహనాలు పోలీసుల స్వాధీనంలో ఉన్నాయి.