చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. 13 సంవత్సరాల భరత్ అనే బాలుడు సెల్ ఫోన్‌ను దొంగిలించి విక్రయించేశాడు. దీంతో కోపంతో ఆ బాలుడికి విద్యుత్ షాక్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. విద్యుత్ షాక్‌కు తేరుకుని పైకి లేస్తున్న బాలుడిని అగ్గిపుల్లలతో శరీరంపై కాల్చారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాలుడు మృతి చెందాడు.
భరత్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మధ్యాహ్నం తేరుకున్నాడు. మళ్ళీ అతడిని అగ్గిపుల్లలతో శరీరంపై కాల్చారు. దీంతో భరత్ స్పృహ తప్పి పడిపోయాడు. భరత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే చనిపోయాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆడుతూపాడుతూ ఉన్న బాలుడు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.