రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఏ మాత్రం తెలియని వాళ్లు ప్రశ్నలు వేయడం అవమానంగా ఉంది. గండికోట ప్రాజెక్టు కోసం టీడీపీ హయాంలో భూ సమీకరణ చేశారా..? నిర్వాసితులకు పరిహరం అందించారా..? బ్రహ్మం సాగర్ చెరువుకు గత ఐదేళ్లల్లో రూపాయైనా ఖర్చు పెట్టారా..? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి తెలిపారు.
టీడీపీని చూస్తే పాపం అనిపిస్తోంది. కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్క ఎమ్మెల్యే అయినా ఉన్నారా..? చిత్తూరులో చంద్రబాబు.. అనంతలో బాలయ్య, కేశవ్ తప్ప వేరే వారు ఉన్నారా..? రాయలసీమ ప్రాజెక్టుల కోసం కృషి చేసి ఉంటే తెలుగుదేశం పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది..? అని వైసీపీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి ప్రశ్నించారు.