ఈ సభకు వేలాది మంది హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 1800 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రజలు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా 600 మంది జనసేన వాలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాయలసీమ జిల్లాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలిరావచ్చన్న ఉద్దేశ్యంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు కృషిచేస్తున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనంతపురానికి చేరుకున్నారు.