చాలామంది మహిళలను ఎక్కువగా బాధించే సమస్య వెన్నునొప్పి, అదే బ్యాక్ పెయిన్. ఐతే ఈ 4 అలవాట్లను కలిగి వుంటే బ్యాక్ పెయిన్ ఎప్పటికీ వదలదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము.
రోజువారీ తాగే టీలో ఎక్కువ మోతాదులో పంచదార వేసుకుని తాగటం వల్ల బ్యాక్ పెయిన్ వదలదు.
బాగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తింటుంటే కూడా సమస్య తగ్గకుండా వుంటుంది.
తక్కువ స్థాయిల్లో వున్న ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా ఇలాగే సమస్య వదలకుండా వుంటుంది.
శరీరానికి వ్యాయామం లేకుండా దీర్ఘకాలం విశ్రాంతి తీసుకునేవారిలో కూడా ఈ బ్యాక్ పెయిన్ సమస్య వస్తుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.