అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం, మిడుతూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వైపు బస్సు ఒకటి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో లారీలో ఉన్న ఇద్దరు, బస్సులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.