Mouni roy at Viswambhara set
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా విశ్వంభర సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో నటి మౌని రాయ్ ప్రత్యేక సాంగ్ లో ప్రవేశించింది. ఈ సందర్భంగా తన సోషల్ మీడియాలో డాన్స్ చేస్తున్న చిన్న వీడియోను షేర్ చేసింది. అయితే కొద్దిసేపటికే అది డిలీట్ చేయాల్సి వచ్చింది. కాగా, ఆ ఫోటోలో దర్శకుడు విజిల్ వేస్తున్న సీన్ కూడా కనిపించింది.