ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించారు. ఏపీ మంత్రివర్గాన్ని ఆయన ఆదివారం పునర్వ్యవస్థీకరించిన విషయం తెల్సిందే. మంత్రివర్గంలోకి కొత్తగా 11 మంది చేరగా, ఐదుగురు మంత్రులు తమ పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సోమవారం మంత్రులకు శాఖలను కేటాయించారు. ప్రస్తుతం మంత్రులకు కేటాయింపులతో ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల కేటాయింపులో కూడా కొన్ని మార్పులు కూడా చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
నారా చంద్రబాబునాయుడు(సీఎం) - సినిమాటోగ్రఫీ, మంత్రులకు కేటాయించగా మిగిలిన శాఖలు
కేఈ కృష్ణమూర్తి (డిప్యూటీ సీఎం) - రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్
నిమ్మకాయల చినరాజప్ప (డిప్యూటీ సీఎం) - హోం, విపత్తు నిర్వహణ
యనమల రామకృష్ణుడు - ఆర్థిక, పన్నుల నిర్వహణ, శాసన సభా వ్యవహారాలు