అనుకున్నట్లే ఏపీలో ఐదుగురు మంత్రులపై వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. కిమిడి మృణాలిని, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్లు వినబడుతున్నాయి. కాగా నారా లోకేష్, అఖిల ప్రియ పేర్లు కొత్త జాబితాలో ఖరారయ్యాయి.