ఏపీ సర్కారు కొత్త పథకం ప్రారంభిస్తోంది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ద్వారా జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ ద్వారా మధ్య ఆదాయ వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ పథకం తొలిదశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమలు చేస్తారు. ఆ తరవాత రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ పథకం అమలు చేస్తారు.
కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ప్రభుత్వం ప్లాట్లు కేటాయిస్తుంది. ఈ పథకంలో లబ్ది దారుల అవసరం మేరకు 150, 200, 240 గజాల స్థలాల్లో తమకు నచ్చిన దాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.