వైద్య, ఆరోగ్యశాఖ అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించిన సీఎం జగన్‌

సోమవారం, 10 జనవరి 2022 (13:37 IST)
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పరిశీలించారు. వాటి పనితీరును స్వయంగా వైద్య నిపుణులను అడిగి తెలుసుకున్నారు. 
 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య ఆరోగ్య శాఖ కొత్త‌గా దాదాపు 20 రకాలకు హై ఎండ్‌ ఎక్విప్‌మెంట్ స‌మ‌కూర్చుకుంది. ఈ వైద్య ప‌రిక‌రాల పనితీరును సీఎం జ‌గ‌న్ కి డాక్ట‌ర్లు వివరించారు. వీటితో పాటు మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనుల పురోగతి, పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం వైఎస్‌ జగన్ పరిశీలించారు. 
 
 
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ డాక్టర్‌ బి.చంద్రశేఖర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు