అభ్యర్ధుల జవాబు పత్రాలు, మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో ఉంచాలని కూడా హైకోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించింది. తుది ఆదేశాల మేరకు మాత్రమే తుది ఎంపిక ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్ధులకు సమాచారం ఇవ్వాలని కూడా కోర్టు సూచించింది.
ఆంధ్రప్రదేశ్లో అత్యున్నత సర్వీసులైన గ్రూప్–1, 2 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఈ ఏడాది మార్చిలో అనుమతించింది.ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మార్చి 31వ తేదీ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో గ్రూప్ 1,2 విభాగాల్లో 292 ఉద్యోగాలను ప్రకటించారు. గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్ కమిషనర్లు, డీఎఫ్వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.