బలహీనమైన కండరాలు వెన్నెముకకు సరైన మద్దతు ఇవ్వలేవు, ఇది నొప్పికి కారణమవుతుంది. వయస్సు పెరిగే కొద్దీ వెన్నెముకలోని డిస్క్‌లు క్షీణించడం, కండరాలు బలహీనపడటం వంటి సహజ మార్పులు నొప్పికి దారితీస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు నడుము కండరాలపై ఒత్తిడిని పెంచి నొప్పికి దారి తీస్తాయి లేదా నొప్పిని మరింత తీవ్రతరం చేయవచ్చు.
వెన్నునొప్పికి చెక్ పెట్టాలంటే.. ముందుగా, సరైన భంగిమ పాటించడం చాలా ముఖ్యం. కూర్చునేటప్పుడు లేదా నిలబడేటప్పుడు మీ నడుమును నిటారుగా ఉంచండి. నొప్పితో బాధపడుతున్నప్పుడు వేడి లేదా చల్లని కాపడం (హాట్ ప్యాక్ లేదా ఐస్ ప్యాక్) వాడటం వల్ల ఉపశమనం దొరుకుతుంది.
ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం, సరైన పరుపును ఎంచుకోవడం కూడా నడుముపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి వెన్నునొప్పి నివారణకు, ఉపశమనానికి తోడ్పడతాయి. క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల నడుము కండరాలు బలోపేతమై, వెన్నునొప్పి తగ్గుతుంది. అయితే, నొప్పి తీవ్రంగా ఉంటే లేదా కొన్ని వారాలైనా తగ్గకపోతే, తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.