దాహమేస్తే.. ఆకాశం వైపు.. ఆకలేస్తే భూమి వైపు చూసే రాయలసీమ ధాన్యరాశుల సీమగా దర్శనమిస్తోంది. కోనసీమను తలపించిన ఈ చిత్రాలు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని గుమ్మగుట్ట మండలం కలుగోడు గ్రామంలో దర్శనమిచ్చాయి. 2017లో కురిసిన వర్షాలకు దాదాపు పదేళ్ల తరువాత భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీరొచ్చింది.
53 అడుగుల గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. దాదాపు 8 నెలల క్రితం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నియోజకవర్గ ఎమ్మెల్యే, సమాచార- పౌరసంబంధాలు, గ్రామీణ గృహనిర్మాణ శాఖా మంత్రి కాలవ శ్రీనివాసులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అలాగే నెలరోజుల క్రితం గుమ్మగుట్ట మండలంలో మంత్రి కాలవ శ్రీనివాసులు పర్యటించినప్పుడు భూమికీ పచ్చాని రంగేసినట్టు ఉన్న పంటను తన్మయత్వంతో పరిశీలించారు.