ఏపీలో బలపడుతున్న నైరుతి రుతుపవనాలు

గురువారం, 26 మే 2022 (17:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. వీటి కారణంగా వచ్చే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి బలమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా, వీటి ప్రభావం కారణంగా ఏపీతో పాటు తమిళనాడు, లక్ష్యదీప్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్నిప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమారిన ప్రాంతంతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
వచ్చే 48 గంటల్లో దక్షి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు మొత్తం మాల్దీవులు, లక్ష్యదీప్‌లోని పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలపై ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడివున్నాయి. 
 
దీంతో నైరుతు రుతపవనాలు బలపడి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లక్ష్యదీప్, తెలంగాణా రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు