మందు బాబులకు శుభవార్త.. ఏపీలో తమిళనాడు మద్యం బ్రాండ్లు

బుధవారం, 16 నవంబరు 2022 (09:39 IST)
మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా వెలసివున్న మద్యం షాపుల్లో కొత్తగా పదిరకాలైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు ప్రటించింది. తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. వీటిని ఉన్నవాటికంటే ఎక్కువ ధరకు అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) తెలిపింది. 
 
ప్రస్తుతం కొన్ని కేటగిరిల బీరు ధర రూ.200గా ఉంది. ఇపుడు కొత్తగా అనుమతి పొందిన బీరు ధర రూ.220గా ఉంది. అలాగే, మరికొన్ని కేటగిరీల్లో క్వార్టర్ మద్యం ధర రూ.110గా ఉంటే ఇపుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల మద్యం ధర రూ.130గా ఉంది.
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎన్.ఎస్.జే. షుగర్స్ అండ్ ప్రాడక్ట్ లిమిటెడ్ సంస్థతో పాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు సంబంధించిన ఈ కొత్త బ్రాండ్లను ఏపీలోని మద్యం దుకాణాల్లో అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు