విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

గురువారం, 29 ఆగస్టు 2019 (08:35 IST)
స్థానిక డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న యశోద భార్గవిని భీమునిగుమ్మం కి చెందిన చదలవాడ సాయి కత్తితో గొంతుపై  దాడి కలకలం రేపింది.
సాయి అంటూ గత మూడేళ్లుగా వెంటపడడం వారి కుటుంబ సభ్యులు వద్ద కూడా విషయం తెలియడంతో సాయిని హెచ్చరించారు. పెద్దలు నీ ఉద్యోగం సంపాదిస్తే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని ప్రయత్నం చేశారు.

అయితే అమ్మాయి మరో అబ్బాయితో మాట్లాడుతుందని అనుమానంతో స్థానిక రామచంద్ర కాలేజీ నుంచి వస్తున్న అమ్మాయి పై కత్తితో దాడి చేశారు. స్థానికులు వెంటనే పట్టుకొని సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితున్ని పోలీస్ స్టేషన్ తరలించారు. అమ్మాయి ఎన్టీఆర్ వంద పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు